ఎర్రగుంట్లలో 41 ద్విచక్ర వాహనాలు సీజ్

KDP: ఎర్రగుంట్లలోని ప్రకాశ్ నగర్‌లో సోమవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించి, సరైన పత్రాలు లేని 41 మోటార్ సైకిళ్లు, ఒక ఆటోను సీజ్ చేశారు. ప్రజలను అప్రమత్తం చేయడమే కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశమని సీఐ నరేష్ బాబు తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముద్దనూరు, కొండాపురం సీఐలు పాల్గొన్నారు.