ఆంధ్రరత్న భవన్‌లో కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం

ఆంధ్రరత్న భవన్‌లో కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం

NTR: విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో గురువారం కిసాన్ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు YS షర్మిల పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో YSR హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదన్నారు. పండుగ లాంటి వ్యవసాయాన్ని నేడు దండుగ చేశారని ఎద్దేవ చేశారు. అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని రైతుల ఆత్మహత్యల్లో ప్రథమ స్థానంలో నిలిపారని అన్నారు.