వంద మంది విద్యార్థులకు ఉద్యోగాలు
GNTR: తెనాలికి చెందిన వంద మంది విద్యార్థులు ఒకేసారి క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలకు ఎంపికై సత్తా చాటారు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో బీకాం, బీసీఏ, బీఎస్సీ చదువుతున్న విద్యార్థులు బెంగళూరుకు చెందిన కార్పొరేట్ సంస్థ ఐఎల్ఎంలో ఉద్యోగాలు సాధించారు. ఇటీవల కాలేజీలో సంస్థ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో పాల్గొన్న 100 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు.