ముమ్మర ప్రచారం చేపట్టిన ధూళిపాళ్ల

GNTR: పొన్నూరు పట్టణం ఏడో వార్డులో బుధవారం టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ముమ్మర ప్రచారం చేపట్టారు. వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి 'బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ' కరపత్రాలను పంచుతూ పొన్నూరులో అభివృద్ధి జరగాలంటే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కాలనీవాసులను అభ్యర్థించారు. ధూళిపాళ్ల పర్యటనలో టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.