ఇరాన్‌ యుద్ధం.. 8మంది భారతీయులు మృతి

ఇరాన్‌ యుద్ధం.. 8మంది భారతీయులు మృతి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. తాజాగా కువైట్‌లోని ఓ కీలక విద్యుత్, నీటి డీసాలినేషన్ ప్లాంట్‌పై ఇరాన్ జరిపిన దాడిలో భారతీయ కార్మికుడు మృతి చెందాడు. ఈ దాడిలో సర్వీస్ భవనం భారీగా దెబ్బతిన్నట్లు అధికారులు ధృవీకరించారు. దీంతో ఈ యుద్ధం కారణంగా ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సంఖ్య ఎనిమిదికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది.