సీఎం రేవంత్ రెడ్డి సభకు ఏర్పాట్లు
NRPT: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 1న మక్తల్ పర్యటనకు రానున్న నేపథ్యంలో, డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ రామ్ లాల్, ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డిలు గొల్లపల్లి శివారులో ఏర్పాటు కానున్న సీఎం సమావేశ స్థలాన్ని సోమవారం రాత్రి పరిశీలించారు. వేదిక వద్ద బందోబస్తు, హెలిప్యాడ్, పార్కింగ్ స్థలాలు, భద్రతా పరమైన అంశాలను వారు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.