'ఎరువుల వినియోగంలో సమతుల్యత పాటించాలి'

'ఎరువుల వినియోగంలో సమతుల్యత పాటించాలి'

AKP: ఎరువుల వినియోగంలో సమతుల్యత పాటించాలని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం సేద్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త గౌరీ సూచించారు. రాంబిల్లి మండలం దిమిలిలో రైతులకు ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. సేంద్రియ రసాయనిక ఎరువుల వినియోగంలో సమతుల్యత పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చునన్నారు.