విజయ్ టార్గెట్‌గా పొలిటికల్ మూవీ

విజయ్ టార్గెట్‌గా పొలిటికల్ మూవీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు 'TN 2026' సినిమాపై దుమారం రేగుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో TVK అధినేత విజయ్ తరహా వేషధారణ, 'మొహానికి రంగు వేసుకునే వాడికి రాజకీయాలు ఎందుకు?' అనే డైలాగుతో పాటు, ఓ ప్రముఖ నటితో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు వివాదాస్పదంగా మారాయి. విజయ్‌ని టార్గెట్ చేస్తూ ఈ మూవీని తీశారని TVK నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మూవీ ఈనెల 10న విడుదల కానుంది.