ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగుల వినూత్న నిరసన

GNTR: పట్టణంలో అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) ఆధ్వర్యంలో నిరుద్యోగులు అర్థనగ్నంగా పండ్లు అమ్ముతూ వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆవేదనలో మునిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పేర్కొన్నారు.