'మాకు త్రాగునీరు ఇప్పించండి సారు'

'మాకు త్రాగునీరు ఇప్పించండి సారు'

KMM: వేంసూరు మండలం లచ్చన్నగూడెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత రెండు రోజులుగా తాగునీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాక్టర్ ద్వారా డ్రమ్ములలో నీటిని అర కొరగా పోస్తున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శిని వివరణ అడుగుదామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందన్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని మంగళవారం కాలనీ వాసులు మండలాధికారులను వేడుకుంటున్నారు.