విషాదం.. దంపతుల ఆత్మహత్య

విషాదం.. దంపతుల ఆత్మహత్య

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్న రామన్‌చర్ల గ్రామంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పుర్మ రాంరెడ్డి (80), పుర్మలక్ష్మి (70) వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరి మరణంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.