అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
ప్రకాశం: అగ్నిమాపక శాఖ వారోత్సవాలలో భాగంగా గురువారం గిద్దలూరు పట్టణంలో అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు. అగ్నిమాపక శాఖ అధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. షార్ట్ సర్క్యూట్, గ్యాస్ సిలిండర్లతో అగ్నిప్రమాదాలు వంటివి ఎలా ఎదుర్కోవాలో ప్రజలకు దృశ్య రూపంలో వివరించారు.