'దోస్త్ హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు'
ASF: కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు పొందే విద్యార్థుల సౌకర్యార్థం దోస్త్ హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ కే. శ్రీదేవి తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ ప్రవేశాల సందర్భంగా ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేశామన్నారు. డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన సమాచారం కోసం 7013607011, 9440194179 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.