ఈరోజు కడపకు సినీ నటుడు అశ్విన్

KDP: ప్రముఖ సినీ నటుడు అశ్విన్ ఈరోజు కడపకు వస్తున్నట్లు YSRCP యువజన నాయకుడు అక్షయ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో కడపకు చేరుకొని పలు క్షేత్రాలను సందర్శిస్తారు. ముందుగా శ్రీ విజయదుర్గా దేవి ఆలయం దర్శించి, అనంతరం ఎన్జీవో కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహం వద్ద పూజలు చేయనున్నారు. సాయంత్రం పాత కడప వెంకటేశ్వర స్వామి వారి దర్శిస్తారు.