వెలుగొండ ప్రాజెక్టుపై అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే

ప్రకాశం: మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గురువారం అమరావతిలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి సత్య ప్రసాద్, ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులు వెలుగొండ ప్రాజెక్టు, గుండ్లకమ్మ ప్రాజెక్టులపై జిల్లా ఇరిగేషన్ ఎస్ఈతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.