'అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి'
WNP: జిల్లాలో అక్రమంగా గుట్టలు, అడవులను తవ్వుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డా. సతీష్ యాదవ్ కోరారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జీ.చిన్నారెడ్డికి వినతిపత్రం అందించారు. అధికారుల అండతోనే ఈ దోపిడీ జరుగుతోందని, గుట్టలను కాపాడకపోతే జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.