VIDEO: వీరభద్రుడి కళ్యాణం కమనీయం
SRD: రాయికోడ్ మండల కేంద్రంలో కొనసాగుతున్న జాతర ఉత్సవాల్లో భాగంగా ఇవాళ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. పురోహితులు వైదిక సాంప్రదాయం ప్రకారంగా వేదమంత్రాలతో స్వామి వారి కళ్యాణం కమనీయంగా కొనసాగింది. ఆలయ మండపంలో వేలాది మంది ప్రజలు స్వామివారి కల్యాణాన్ని కనురెప్ప కొట్టకుండా ఆసక్తిగా వీక్షించారు.