ఉల్లి నష్టాలకు ఎకరాకు రూ. 80 వేల డిమాండ్

ఉల్లి నష్టాలకు ఎకరాకు రూ. 80 వేల డిమాండ్

KRNL: ఉల్లి సాగులో రైతులు తీవ్ర నష్టపోయారని, వారికి ఎకరాకు రూ. 80 వేలు పరిహారం అందించాలని ఏపీ రైతు సంఘ కార్యదర్శి సిద్దు డిమాండ్ చేశారు. పత్తికొండలో మాట్లాడుతూ.. ప్రభుత్వం క్వింటా రూ. 1,200కు ఉల్లి కొనుగోలు చేసినా, చెప్పినట్లు రూ. 7 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కాలేదని వెల్లడించారు. పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ ఆర్డీవో భరత్ నాయక్‌కు వినతిపత్రం ఇచ్చారు.