సింగూర్ ప్రాజెక్ట్‌కు 28,821 క్యూసెక్కులు వరద
SRD: సింగూర్ ప్రాజెక్ట్‌కు 28,821 క్యూసెక్కుల వరద కొనసాగుతున్నదని ప్రాజెక్ట్ AEE మహిపాల్ రెడ్డి శనివారం సాయంత్రం తెలిపారు. ఎగువ నుంచి వరద ఉద్ధృతి కారణంగా ప్రాజెక్టు 4 గేట్లు ఓపెన్ చేసి 33,029 క్యూసెక్కులు విడుదలవుతున్నాయని చెప్పారు. జెన్-కో విద్యుత్ ఉత్పత్తికి 2180 క్యూసెక్కులు, మిషన్ భగీరథ, HWMS, నీటి ఆవిరి 544 క్యూసెక్కులు జలాలు రిలీజ్ అవుతున్నాయని పేర్కొన్నారు.