'నేర రహిత సమాజం స్థాపిద్దాం'

VSP: నేర రహిత సమాజ నిర్మాణం కోసం మహిళలు ముందుకొచ్చి అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవాలని 'ద ఇండియన్ మహిళా ఫౌండేషన్' వ్యవస్థాపకురాలు జీవీఎల్ పద్మ పిలుపునిచ్చారు. గాజువాకలోని ములగాడ గ్రామంలో శుక్రవారం జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గ్రామంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలపై మహిళలే ఆదిపరాశక్తులై పోరాడాలని ఆమె అన్నారు.