చిరంజీవి ట్రస్టులపై కేంద్రం కీలక నిర్ణయం

చిరంజీవి ట్రస్టులపై కేంద్రం కీలక నిర్ణయం

మెగాస్టార్ చిరంజీవి స్వచ్చంద సంస్థకు కేంద్రం విదేశీ విరాళాల అవకాశం కల్పించింది. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టును ఎఫ్‌సీఆర్ఏ కింద నమోదుకు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో విదేశీ విరాళాలు స్వీకరించే వీలు ట్రస్టుకు కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. చారిటబుల్ ట్రస్టు కింద చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ నడుపుతున్న విషయం తెలిసిందే.