గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జీఎం
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాకతీయ స్టేడియంలో ఈనెల 26న సింగరేణి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భముగా ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి గురువారం ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జీఎం మాట్లాడుతూ.. వేడుకలలో ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేయడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.