'స్పైడర్ మ్యాన్'లా మారిన 89 ఏళ్ల బామ్మ
బీజింగ్‌లో 89 ఏళ్ల బామ్మ 27వ అంతస్తులో చిక్కుకుపోయింది. ఫోన్ అందుబాటులో లేకపోవడంతో, ఎవరికీ సమాచారం ఇవ్వలేకపోయింది. దీంతో కిటికీ ద్వారా ఏకంగా 21వ అంతస్తు వరకు కిందకు దిగింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెను సురక్షితంగా రక్షించడంతో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.