VIDEO: భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి

BDK: భద్రాచలం వద్ద గోదావరి 33.7 అడుగులకు పెరిగి ప్రవహిస్తుంది. ఆదివారం ఉదయం 6 గంటలకు 32.80 అడుగులు ఉన్న గోదావరి, మధ్యాహ్నం ఒంటి గంటకు 33.70 అడుగులకు పెరిగింది. ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిలకడగా ప్రవహించింది. కాగా భద్రాచలం నుంచి 5,29,708 క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెలుతోంది.