తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత స్వల్పంగా పెరిగింది. దీంతో పలు జిల్లాల్లోని ప్రజలు చలికి వణుకుతున్నారు.
మెదక్‌లో 14.2 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17 డిగ్రీలు నమోదయ్యాయి. ఏపీలోని ఏజెన్సీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చలి ప్రభావం వల్ల చిన్నారులు, వృద్ధులు, వ్యాధులతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.