VIDEO: 'నిందితులను జిల్లా నుంచి బహిష్కరించాలి'
అన్నమయ్య: రాజంపేట మండలం పులపుత్తూరులో దంపెట్ల మల్లికార్జున హత్య కేసులో నిందితులను జిల్లా బహిష్కరణ చేయాలని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.