'డబ్బులు తీసుకొని ఇళ్లు కట్టివ్వలేదు'

'డబ్బులు తీసుకొని ఇళ్లు కట్టివ్వలేదు'

KDP: ప్రొద్దుటూరు జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టిస్తామని డబ్బులు తీసుకొని కట్టివ్వలేదని బాధితులు MLA వరదరాజుల రెడ్డికి పిర్యాదు చేశారు. గురువారం ఆయన తన కార్యాలయంలో ‘ప్రజా దర్బార్’ నిర్వహించారు. పలువురు బాధితులు ఇళ్ల నిర్మాణాలపై పిర్యాదు చేశారు. కాంట్రాక్టర్లు తమ నుంచి రూ.35 వేలు, ప్రభుత్వం నుంచి రూ.1.80 లక్షలు తీసుకొని తమకు ఇళ్లు కట్టివ్వలేదని తెలిపారు.