అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

ASF: అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. లింగాపూర్‌ మండలం ఎల్లపటార్‌ గ్రామానికి చెందిన షేక్‌ మహబూబ్‌ తన పంట పొలంలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడని తమకు అందిన సమాచారంపై SI గంగన్న గ్రామానికి వెళ్లి తనిఖీ చేయగా 24 గంజాయి మొక్కలు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకుని నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్‌ తరలించారు.