బాపట్ల నుంచి తాడేపల్లికి భారీ ర్యాలీ
BPT: జగన్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను టీడీపీ ప్రభుత్వం ప్రైవేటు చేయడాన్ని నిరసిస్తూ.. వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా బాపట్ల జిల్లాలో సేకరించిన సంతకాల ప్రతులను సోమవారం బాపట్ల నుంచి తాడేపల్లికి తరలించారు. ఈ సందర్భంగా చీరాల పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో జిల్లాలోని పార్టీ ఇన్‌ఛార్జీలందరూ పాల్గొన్నారు.