బొల్లారంలో ఉచిత నీటికి బిల్లుల వసూళ్ల వైనం

బొల్లారంలో ఉచిత నీటికి బిల్లుల వసూళ్ల వైనం

SRD: సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో కాలుష్య పారిశ్రామిక ప్రాంతాల గ్రామాలకు ఉచితంగా మంచినీరు అందించాల్సి ఉన్నా, బొల్లారం మునిసిపల్ అధికారులు పట్టించుకోవడంలేదు. ఉచితంగా ఇవ్వాల్సిన నీటికి బిల్లులు వసూలు చేస్తున్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన బొల్లారం కాంగ్రెస్ నాయకుడు వి. చంద్రారెడ్డి మంచినీటి బిల్లులు వసూలు చేస్తున్న విషయాన్ని ధ్రువీకరించారు.