నార్నూర్‌లో కుక్కల దాడి.. చిన్నారికి గాయాలు
ADB: నార్నూర్ మండలంలోని ఇందిరా నగర్ కాలనీలో సాయంత్రం ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట ఆడుకుంటున్న మూడు సంవత్సరాల మోక్షితపై అకస్మాత్తుగా వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. బాలిక అరుపులు విని కుటుంబ సభ్యులు వెంటనే చేరుకుని కుక్కలను తరిమి, చిన్నారిని రక్షించారు. అనంతరం సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.