అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం

అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం

కోనసీమ: రామచంద్రపురం రూరల్ చోడవరం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు పశువులు తీవ్రంగా గాయపడటంతో పాటు గడ్డివాము, ఒక బైక్ కాలిపోయాయి. ఈ సందర్భంగా బాధితులను కూటమి నాయకులు సత్యం శనివారం పరామర్శించారు. మంత్రి సుభాష్ ఆదేశాల మేరకు బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చి, రూ.10 వేలు, నిత్యవసర వస్తువులు అందజేశారు.