'ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే మందులనే వాడాలి'
KNR: వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, పీవో ఎన్సీడీ, పీవో ఎంహెచ్ఎన్‌తో కలిసి మోతాజాఖానా పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న ఆశా డే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు మందులు కాకుండా ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న మందులనే అందరికీ ఇవ్వాలని సూచించారు.