'ఎన్నికల నియమావళి పై అభ్యర్థులకు అవగాహన కార్యక్రమం'
SRPT: పెనపహడ్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు అభ్యర్థులకు ఎన్నికల అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ నరసింహ , డిఎస్పీ ప్రసన్నకుమార్ నిబంధనలపై స్పష్టమైన సూచనలు చేశారు. ఓటర్లకు ప్రలోభాలు చూపొద్దని, ఖర్చులు పరిమితిలో పెట్టాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలను పాటించాలని చెప్పారు. బైండోవర్ ఉల్లంఘిస్తే 5 లక్షలు జప్తు చేస్తామని హెచ్చరించారు.