చమురు నౌకపై దాడి.. భారతీయుడు మృతి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన వేళ గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు పదార్థాలతో కూడిన 'డ్రోన్ బోట్' ఒక చమురు నౌకను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంతో, అందులో పనిచేస్తున్న ఒక భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోయాడు. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ప్రయాణిస్తున్న 'MKD VYOM' అనే చమురు నౌకపైకి పేలుడు పదార్థాలతో నిండిన డ్రోన్ బోట్ దూసుకువచ్చి ఢీకొట్టింది.