జిల్లా పరిషత్ హైస్కూల్‌ను తనిఖీ చేసిన కమిషనర్
W.G: ఆకివీడులోని పులవర్తి లక్ష్మణస్వామి జిల్లా పరిషత్ హైస్కూల్లో గురువారం మధ్యాహ్నం నగర పంచాయతీ కమిషనర్ కృష్ణమోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.