ఈ నెల 6న ఎడ్ల బండి పోటీలు

సత్యసాయి: గోరంట్ల మండలం కరావులపల్లి తండాలో ఈ నెల 6న జిల్లా స్థాయి ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహిస్తున్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని 6వ తేదీన ఎడ్లబండి పోటీలు నిర్వహించనున్నట్లు శ్రీరామచారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ సునీతా శంకరా నాయర్ తెలిపారు. విజేతలకు వరుసగా రూ.లక్ష, రూ.75వేలు, రూ.50వేలు, రూ.40వేలు ఇస్తామన్నారు. వివరాలకు 9000895664, 991218778 సంప్రదించావలెను.