గోల్డ్ మెడల్ సాధించడం జిల్లాకు గర్వకారణం: టీజీ

KRNL: ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి కరాటే పోటీల్లో కర్నూలు క్రీడాకారుడు దినేష్ పాల్గొని బంగారు పతకం సాధించడం జిల్లాకే గర్వకారణం అని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. ఆదివారం టీజీ తన ఛాంబర్‌లో క్రీడాకారుడిని అభినందించారు. ఆగస్టు 15న గవర్నర్ ఎట్ హోమ్‌లో దినేష్‌ను ఆహ్వానించడం క్రీడాకారులకు లభించే గౌరవం అన్నారు.