నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్ట్: డీఎస్పీ

KDP: మైదుకూరు రూరల్ పరిధిలో బుధవారం నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 42 ఎర్రచందనం దుంగలు, గొడ్డలి స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ మీడియాకు తెలిపారు. ఈ మేరకు ఎర్రచందనం స్మగ్లర్లను శాకచక్యంగా పట్టుకున్న మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్, దువ్వూరు ఎస్సై వినోద్ కుమార్, సిబ్బందిని డీఎస్పీ రాజేంద్రప్రసాద్ అభినందించారు.