మహిళా పోలీసులతో ఎస్సై సమావేశం

మహిళా పోలీసులతో ఎస్సై సమావేశం

కృష్ణా: తోట్లవల్లూరు పోలీసులు, సచివాలయ మహిళా పోలీసులతో ప్రత్యేక సమావేశం శుక్రవారం నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఎస్సై అవినాష్ మాట్లాడుతూ.. ఉత్సవాల సమయంలో శాంతిభద్రతలు కాపాడటంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, సంఘటనలు గమనించిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.