కొల్లివలసలో త్రాగునీటి సమస్యను పరిష్కరించండి

కొల్లివలసలో త్రాగునీటి సమస్యను పరిష్కరించండి

SKLM: బూర్జ మండలం కొల్లివలస గ్రామంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ బూర్జ మండల ఎంపీడీవోకు గురువారం వినతిపత్రం ఇచ్చినట్లు కొల్లివలస ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్, మండల ఉపాధ్యక్షులు బుడుమూరు సూర్యరావు తెలిపారు. త్రాగునీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంకును మంజూరు చేయాలని కోరారు. స్థానికంగా ఉన్న వివిధ సమస్యలను ఎంపీడీవోకు వివరించారు.