పలమనేరు ఎరువుల దుకాణాల్లో జేడీ తనిఖీలు

పలమనేరు ఎరువుల దుకాణాల్లో జేడీ తనిఖీలు

CTR: పలమనేరు పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మంగళవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ స్థానిక అధికారులతో కలిసి ఈ తనిఖీలు చేపట్టి దుకాణదారులకు పలు సూచనలు చేశారు. ఎరువులు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, డీబీటీ విధానానాన్ని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏవో సంధ్య తదితరులు పాల్గొన్నారు.