వృద్ధురాలిపై అత్యాచారం.. కేసు నమోదు
అన్నమయ్య: బి. కొత్తకోట మండలంలో ఓ వృద్ధురాలిపై అత్యాచారం చేసిన ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక సీఐ గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఈశ్వర్ తన ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసంది. దీంతో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. వృద్ధురాలు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.