VIDEO: 'ఇందిరమ్మ ఇళ్లను ఉగాది లోపు పూర్తి చేయాలి'

VIDEO: 'ఇందిరమ్మ ఇళ్లను ఉగాది లోపు పూర్తి చేయాలి'

MLG: జిల్లా కేంద్రంలోని మల్లంపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఆదివారం జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ పరిశీలించారు. లబ్ధిదారులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఉగాదిలోగా పనులు పూర్తి చేసి గృహప్రవేశం చేయాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించి, నాణ్యతతో పూర్తి చేయాలని, బిల్లులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.