కలుషితమైన మంచినీటి పైపుల డమ్మీలు తొలగింపు

కలుషితమైన మంచినీటి పైపుల డమ్మీలు తొలగింపు

కృష్ణా: పెనమలూరు గ్రామం ఎస్సీ కాలనీలో ప్రజల అభ్యర్థన మేరకు కలుషితమైన మంచినీటి పైపు డమ్మిలను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నిన్న పరిశీలించారు. సమస్యను తక్షణమే పరిష్కరించి, ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటి సరఫరా పునరుద్దరించాలని అధికారులకు ఆయన ఆదేశించారు. తమ సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపిన ఎమ్మెల్యేకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.