అన్ని రకాల వడ్లకు బోనస్ వర్తింపజేయాలి: సీపీఎం

అన్ని రకాల వడ్లకు బోనస్ వర్తింపజేయాలి: సీపీఎం

కరీంనగర్: రైతులు పండించిన అన్ని రకాల వడ్లకు బోనస్ వర్తింపచేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం హుజురాబాద్‌లోని సీపీఎం పార్టీ కార్యాలయంలో వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ.. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన వెంటనే కొనుగోలు చేయాలని, రైతుల ఆందోళన నేపథ్యంలో బోనస్‌పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.