విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం

NLG: దేవరకొండలో ఎమ్మెల్యే బాలునాయక్ విద్యుత్ శాఖ డైరెక్టర్ శివాజీ, సంబంధిత అధికారులతో కలసి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వానాకాలం ప్రారంభం కావడంతో గాలి వానలు, వర్షాలు, పిడుగులు, చెట్లు విరిగిపడటం వంటి పరిస్థితులు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించే అవకాశముందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.