సమాజ మార్పులో విద్యార్థులదే కీలక పాత్ర: ఎస్సై
ELR: సమాజ మార్పులో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని ఆగిరిపల్లి ఎస్సై శుభశేఖర్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు చట్టాలు, మహిళా భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. శక్తి టీమ్‌ల సేవలను వివరించారు. అత్యవసర సమయంలో 112, మహిళల రక్షణకు 181 హెల్ప్ లైన్ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు.