నగరంలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
HYD: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. త్రీ స్టార్ హోటళ్లు, పబ్‌లు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలి. రాత్రి 10 గంటల తర్వాత అవుట్‌డోర్ సౌండ్‌ను నిషేధించారు. ఇండోర్ ఈవెంట్లు రాత్రి 1 గంట వరకు మాత్రమే నిర్వహించాలి. డ్రగ్స్, ఫైర్ వర్క్‌పై మైనర్లకు ప్రవేశంపై నిషేధం విధించారు.