VIDEO: కుమ్మరి కుంట చెరువును పరిశీలించిన: మున్సిపల్ ఛైర్మన్
WGL: నర్సంపేట పట్టణ పరిధిలోని కుమ్మరి కుంట చెరువును శుక్రవారం మున్సిపల్ ఛైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చెరువుల పరిరక్షణకు మున్సిపాలిటీ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. చెరువు పరిసరాల్లో శుభ్రత పనులు త్వరితగతిన చేపట్టాలని, మురుగు నీరు చెరువులోకి చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.